Vijayasai Reddy: అంతా నా ఇష్టం- రాజకీయాల్లోకి రీఎంట్రీపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

నేను ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలనుకుంటే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.

Vijayasai Reddy: అంతా నా ఇష్టం- రాజకీయాల్లోకి రీఎంట్రీపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Updated On : April 18, 2025 / 6:16 PM IST

Vijayasai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ కావాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు. అంతా తన ఇష్టం అని చెప్పారు. తాను కావాలంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పారు. తాను వ్యవసాయం వదిలేసుకుని వ్యాపార రంగంలోకి ఎంటర్ అవుతాను, లేదంటే రాజకీయాల్లోకి అయినా వస్తాను.. అంతా తన ఇష్టమే అన్నారు.

అందుకోసం తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి, రాజకీయాల్లోకి రీఎంట్రీ, బీజేపీలో చేరిక సహా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ సారి ఈ మార్పులు కూడా..

”నేను ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలనుకుంటే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నా ఇష్టం. నేను కావాలంటే రీ ఎంట్రీ అవుతా. మీ పర్మిషన్ ఏమీ అక్కర్లేదే. నేను వ్యవసాయం వదిలేసుకుంటా. నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా. నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే. దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే. మీ మీడియాలో వ్యాఖ్యానాలు అవసరం లేదే. ఏదైనా ఉంటే నా వరకు నేను చిత్తశుద్ధితో నేనే చెప్తా. ఎంపీ పదవి ఆశించలేదు అని నేనే చెబుతున్నా. అలాంటప్పుడు మీరెలా రాస్తారు ఇవన్నీ” అని విజయసాయిరెడ్డి అన్నారు.

 

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. 3 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించారు అధికారులు. లిక్కర్ పాలసీకి సంబంధించి రెండు మీటింగ్ లు జరిగాయా అని సిట్ ప్రశ్నించింది. 2019 చివరలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రెండు మీటింగ్ లు జరిగింది వాస్తవమే అని విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి రెండు మీటింగుల్లో పాల్గొన్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

”వాసుదేవ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సత్యప్రసాద్ మీటింగ్ లో పాల్గొన్నారు. కిక్ బ్యాగ్స్ గురించి నాకు తెలియదని చెప్పా. రాజ్ కసిరెడ్డి ఒక తెలివైన క్రిమినల్. పార్టీ పెద్దలు పరిచయం చేస్తేనే రాజ్ కసిరెడ్డిని నేను ఎంకరేజ్ చేశా. రాజ్ కసిరెడ్డి నన్ను మోసం చేశాడు. రాజ్ కసిరెడ్డి పార్టీని, ప్రజలను మోసం చేశాడు.

Also Read : జగన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి జగన్ మోసం చేసి వెళ్లిపోయాడు అని మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. అధికారం వచ్చిన 6 నెలల్లో నా 2వ స్థానం 2వేల స్థానానికి పడిపోయింది. నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోండి. తిరిగి రాయొద్దు. నేను చాలా అవమానాల పాలయ్యాను. అవమాన భారం తాళలేక, ఈ కోటరీ వేధింపులు తాళలేక, మా నాయకుడు జగన్ మనసులో నాకు స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడటం జరిగింది. అంతే తప్ప వేరే కారణం కాదని మరోసారి చెబుతున్నా” అని విజయసాయిరెడ్డి అన్నారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here