DSC Notification: డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ సారి ఈ మార్పులు కూడా..

అభ్యర్థులు మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్‌జేసీ, సంక్షేమ శాఖలలోని పోస్టుల వంటి వాటిలో ప్రాధాన్యతాక్రమాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

DSC Notification: డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ సారి ఈ మార్పులు కూడా..

Teacher

Updated On : April 18, 2025 / 3:30 PM IST

డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఏపీ సర్కారు మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.

న్యాయశాఖ గెజిట్‌ను కూడా జారీ చేసింది. దీంతో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది దరఖాస్తు ప్రక్రియలో ఏపీ సర్కారు అనేక మార్పులను తీసుకొస్తోంది. దరఖాస్తుదారులను ఏ, బీ విభాగాలుగా వర్గీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

SC classification: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఇప్పటికే అభ్యర్థుల వయోపరిమితిని పెంచింది. అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపు మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, కటాఫ్‌ తేదీని 2024 జులై 1గా నిర్ణయించింది.

అభ్యర్థులు మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్‌జేసీ, సంక్షేమ శాఖలలోని పోస్టుల వంటి వాటిలో ప్రాధాన్యతాక్రమాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో పదో తరగతి నుంచి బీఈడీ వరకు అన్ని సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించి న్యాయపరమైన ఇబ్బందులు ఏవీ లేకుండా నియామకాలను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటనను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.