SC classification: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌ ప్రకారం.. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు ఇటీవలే ఏపీ సర్కారు తెలిపింది.

SC classification: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం

Updated On : April 17, 2025 / 3:59 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ అర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యాయశాఖ గెజిట్‌ను జారీ చేసింది.

మొత్తం 15 శాతంగా ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి. మూడు భాగాలుగా ఎస్సీ రిజర్వేషన్లను విభజిస్తారు. గ్రూప్‌-ఏలో ఒక శాతం, గ్రూప్‌-బీలో 6.5 శాతం, గ్రూప్‌-సీలో 7.5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.

Duvvada Srinivas: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్.. ఏం జరిగిందో తెలుసా?

ఎస్సీలకు ఏపీలో విద్య, ఉద్యోగాల్లో సమానంగా అవకాశాలు కల్పించాలని భావిస్తే ఏపీ సర్కారు ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ముసాయిదా ఆర్డినెన్స్‌కు క్యాబినెట్‌ బుధవారమే ఆమోద ముద్ర వేసింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌ ప్రకారం.. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు ఇటీవలే ఏపీ సర్కారు తెలిపింది. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు చెప్పింది.

అలాగే, గ్రూప్-2లోని 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పేర్కొంది. ఇక గ్రూప్-3లోని 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది.