సరస్వతి భూములపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు..
సరస్వతి పవర్ భూముల అంశంపై రెవెన్యూ, పీసీబీ, అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో..

Saraswati Power Lands (Photo Credit : Google)
Saraswati Power Lands : సరస్వతి పవర్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ పేరు ఇంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈ పేరు చుట్టూనే తిరుగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఈ సంస్థ షేర్లు, భూములు, పలు అంశాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు చెందిన భూములపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. దీంతో సరస్వతి సంస్థ భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొన్ని రోజులుగా సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515 ఎకరాల భూముల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు సరస్వతి భూములపై ఫోకస్ పెట్టారు. సరస్వతి పవర్ భూముల్లో అటవీ భూములు ఏమేరకు ఉన్నాయి? జల వనరులు ఉన్నాయా? ఉంటే పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారు అనే దానిపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీస్తున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఉన్నాయని ప్రచారం జరగడంతో.. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. ఆ భూములపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ సంస్థకు చెందిన ల్యాండ్స్ లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియజేయాలని.. అలాగే అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు పవన్.
సరస్వతి భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున.. ఆ సంస్థకు పర్యావరణ అనుమతులను ఏ విధంగా పొందారో తెలియపరచాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్.. పీసీబీకి ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి పవర్ భూముల అంశంపై రెవెన్యూ, పీసీబీ, అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
Also Read : ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్.. కంటతడి