Gautam Sawang : పట్టాభి మాట్లాడాకే ఆందోళనలు మొదలు, తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది

రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది, ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత..

Gautam Sawang : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ దారుణమైన భాష మాట్లాడారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని… రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.

Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

పార్టీ కార్యాలయంలో కూర్చొని ఇలాంటి భాషను మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి భాషను ఎవరూ అంగీకరించరని చెప్పారు. పట్టాభి వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తామని డీజీపీ తెలిపారు. కొన్నిరోజులుగా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామన్నారు. చంద్రబాబు కాల్ చేస్తే స్పందించలేదన్న దానిపైనా డీజీపీ మాట్లాడారు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత లేదని డీజీపీ వివరించారు.

Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?

ఇక, గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని గతంలోనే స్పష్టం చేశామని డీజీపీ తెలిపారు. అక్కడి నుంచి ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని విజయవాడ సీపీ చెప్పారని గుర్తు చేశారు. డగ్స్ పై ఇన్నిసార్లు స్పష్టంగా చెప్పినా… పదేపదే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మరోవైపు టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత పట్టాభిరామ్ ఇల్లు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేగింది. ఈ దాడులు చేసింది వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపిస్తోంది. దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.

విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. సామగ్రి, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో పట్టాభి ఇంటిపైన, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా దాడులు జరిగాయి. ఆ దాడులు చేసింది వైసీపీ శ్రేణులే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు