AP DSC 2025 : డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. నేడు కాల్ లెటర్లు.. ఈ సూచనలు తప్పనిసరిగా..

AP DSC 2025 : మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. మంగళవారం కాల్ లెటర్లు

AP DSC 2025

AP DSC 2025 : మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని చెప్పారు. 26వ తేదీ మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఈ కాల్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. (AP DSC 2025)

Also Read : IBPS Recruitment 2025 : డిగ్రీ కంప్లీటైన వారికి శుభవార్త.. ఇంకా మూడ్రోజులే గడువు.. 10,277 క్లర్క్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. భారీగా వేతనం

ఏపీ డీఎస్సీలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సోమవారం (ఆగస్టు 25వ తేదీ) కాల్ లెటర్లు అందుతాయని ఎదురు చూశారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినా రెండు జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. కాగా.. కాల్ లెటర్ల పంపిణీలో ఆలస్యం జరగడంతో వెరిఫికేషన్ ప్రక్రియను(AP Mega DSC) ఒక రోజు వాయిదా వేశారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని ఎంవీ కృష్ణారెడ్డి చెప్పారు.

26వ తేదీ మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని, అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 28వ తేదీ ఉదయం 9గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని, ఈలోగా అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.

 

ఈ సూచనలు పాటించాలి..

♦ 28వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం అవుతుంది.
♦ అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు లాగిన్ ద్వారా సైట్ లో అప్లోడ్ చేయాలి.
♦ వెరిఫికేషన్ కోసం ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), అంగ వైకల్యం ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), కాల్ లెటర్ లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పరిశీలనకు హాజరు కావాలి.
♦ కేటాయించిన తేదీ, సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లాలి.
♦ ఒకవేళ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. అనంతరం మెరిట్ జాబితాలోని తరువాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు.

 

ఇదిలాఉంటే.. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులను వచ్చే నెల రెండో వారంలోనే పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్‌ను సిద్ధం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.