AP Education Department
Dasari Lasya suicide case : విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్. దీనిపై విచారణ జరపాలని, పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ ..గోశాలలోని చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దాసరి లాస్య ఆత్మహత్యతో కలకలం చెలరేగింది. హాస్టల్ రూమ్‌లోనే లాస్య ఉరేసుకుందని క్యాంపస్ సిబ్బంది ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. గంట వ్యవధిలోనే చనిపోయిందని చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దాసరి లాస్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకీ తరలించింది కాలేజ్ యాజమాన్యం. ఒక్కగానొక్క కూతురు మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. నిన్న సాయంత్రం చైతన్య గర్ల్స్ క్యాంపస్ సిబ్బంది ఫోన్ చేసి తలా ఒకరకంగా చెప్పారని లాస్య తండ్రి ఆరోపించారు. హాస్టల్‌లో ఏం జరిగిందో నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారాయన. విషయం తెలుసుకున్న విద్యా శాఖ మత్రి విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలని ఆదేశించారు.