నరికేసినా ఫలించటం చెట్టుకే సాధ్యం..కొట్టేసిన కొమ్మకు విరగకాసిన మామిడికాయలు

Mango

more mongos in tree : నీడనిచ్చి..పండ్లనిచ్చే చెట్లను నరికేటయం మనిషి లక్షణమైతే..తనను నిలువునా నరికివేసినా..ఆ కొమ్మకే పండ్లను కాసి మనిషికి ఇవ్వటం ఒక్క చెట్టుకే సాధ్యం. అని కచ్చితంగా అనిపిస్తుంది కొట్టేసిన కొమ్మకు విరగకాసిన ఈ మామిడి పండ్లను చూస్తే..!! నీటనిచ్చి మనిషికి ప్రాణవాయువల్ని ఇచ్చే పచ్చని చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నాం. దీని ఫలితంగా ప్రాణవాయువు కోసం లక్షలు కూడా ఖర్చుపెడుతున్నాం.

అయినా ఆ మానవుడికి బుద్ధి వస్తుందా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎప్పటికప్పుడు ప్రకృతి మనిషికి పాఠాలు చెబుతున్నా మనిషి పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రకృతిలో భాగమైన చెట్లు మాత్రం మనిషిని బ్రతికిస్తునే ఉన్నాయి. ప్రాణవాయువుని ఇచ్చి..పండ్లను ఇచ్చీ..నీడను ఇచ్చి కాపాడుతున్నాయి. ఇదిగో ఈ చెట్టును చూస్తే అది ఎంత నిజమో కదా అనిపిస్తుంది. కొట్టేసిన కొమ్మకు కూడా మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా విరగకాశాయి. కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. కొట్టేసిన మొద్దుకే మామిడికాయలు గుత్తులు గుత్తులుగా విరగకాసింది.

ఏపీలోని కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఓ టీచర్ వ్యవసాయ క్షేత్రంలోని ఓ మామిడి కొమ్మకు అదికూడా కొట్టేసిన కొమ్మ కాయల్ని విరగకాసింది. 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి.