జగన్ మెజారిటీ తగ్గింది.. చంద్రబాబు ఆధిక్యం ఎంత పెరిగిందో తెలుసా?

ఈ ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. వైసీపీ నేతలు ఈ రిజల్ట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.

Chandrababu Vs Jagan Majority Details (Photo Credit : Google)

Jagan Chandrababu Majority : ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎవరి అంచనాలకు అందని విధంగా టీడీపీ కూటమి గెలుపొందింది. ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలయ్యాయి. అటు వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. జగన్, పెద్దిరెడ్డి మినహా కేబినెట్ లోని మంత్రులంతా ఓటమి పాలయ్యారు.

ఈ ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. వైసీపీ నేతలు ఈ రిజల్ట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కు కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆయన అధికారం కోల్పోవడమే కాదు.. ఆయన మెజార్టీ సైతం తగ్గింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు మెజార్టీ మాత్రం పెరిగింది.

గత ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు 20,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ఆయన మెజార్టీ పెరిగింది. చంద్రబాబు 48,006 ఓట్ల మెజార్టీతో తాజాగా గెలుపొందారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన మెజార్టీ తగ్గింది. గత ఎన్నికల్లో జగన్ ఏకంగా 91వేల ఓట్ల మెజార్టీతో పులివెందులలో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన మెజార్టీ 61,687కు తగ్గింది.

Also Read : నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, కూటమి సునామీకి ప్రధాన కారణమిదే- కేకే కీలక వ్యాఖ్యలు