‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే

బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.

‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM Jagan

Updated On : March 27, 2024 / 10:00 AM IST

Memanta Siddham bus yatra: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీల అధినేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ప్రకటనపై దృష్టిసారించిన వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి జగన్ మొదటి విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Also Read : టీడీపీ, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన పలువురు నేతలు

జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ సాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు సీఎం జగన్ హాజరవుతారు. తొలుత ప్రొద్దుటూరులో జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అనంతరం ఆళ్లగడ్డలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేపు (గురువారం) నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతుంది.

Also Read : టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ మాగంటి బాబు గుడ్ బై?

  • బస్సుయాత్ర తొలిరోజు షెడ్యూల్ ఇలా ..
  • బుధవారం ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం 1గంటకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడ నివాళులర్పిస్తారు.
  • మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.
  • మొదటి రోజు (బుధవారం) ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు.
  • ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు.
  • బహిరంగ సభ అనంతరం సున్నంపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు.
  • నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకొని అక్కడే బస చేస్తారు.