ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత మంది పోటీలో ఉన్నారంటే..?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు మొత్తం 209 మంది పోటీలో మిగిలారు.

West Godavari Nominations: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ‌ ఎన్నికల పోలింగ్‌కు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరో ఈరోజు తేలిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు మొత్తం 209 మంది పోటీలో మిగిలారు. నరసాపురం పార్లమెంటు స్థానానికి పోటీలో 21 మంది, ఏలూరు పార్లమెంటు స్థానానికి 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్క్రూటిని అనంతరం 89 మంది పోటీలో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 86 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆచంట- 9
పాలకొల్లు- 15
నరసాపురం- 11
భీమవరం- 15
ఉండి- 13
తణుకు- 13
తాడేపల్లిగూడెం- 13

ఏలూరు జిల్లాలో…
ఏలూరు – 14
ఉంగుటూరు – 12
కైకలూరు – 15
నూజివీడు – 10
పోలవరం – 12
చింతలపూడి – 8
దెందులూరు – 15

ట్రెండింగ్ వార్తలు