VijayaSai Reddy : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

VijayaSai Reddy : వైసీపీని వీడటంపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ జగన్‌‌కు ఎందుకు దూరం కావడానికి గల కారణాలను వివరించారు.

Vijayasai Reddy

VijayaSai Reddy : వైసీపీకి రాజీనామా చేయటంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని, అందుకే తాను జగన్‌కు దూరం అయ్యానన్నారు. ఆయన మనసులో తనకు స్థానం లేదు అని తెలిసిందని చెప్పారు.

ఆ విషయం తెలిసి తన మనసు విరిగిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని తాను జగన్‌కు చెప్పినట్టు తెలిపారు. ముందు కోటరీ నుంచి వైఎస్ జగన్ బయట పడాలని విజయసాయి అన్నారు. అప్పుడే జగన్‌కు భవిష్యత్ ఉంటుందన్నారు. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని తెలిపారు.

జగన్‌ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందన్నారు. నాయకుడు అనేవారు ఈ చెప్పుడు మాటలు నమ్మకూడదు.. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారని హితవు పలికారు. లిక్కర్ స్కాం లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర దారి అని విజయసాయి చెప్పారు. తనకు భయం అంటే తెలీదన్నారు. తాను అనేక అవమానాలు కష్టాలు వైసీపీలో పడ్డానని చెప్పుకొచ్చారు.

Read Also : 8th Pay Commission : కీలక అప్‌డేట్.. పెన్షనర్లకు పండగే.. అదేగానీ జరిగితే, రూ. 2 లక్షల పైనే పెన్షన్.. పూర్తి లెక్కలు మీకోసం..!

తనకు నాకు అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయానని స్పష్టం చేశారు. నేను ప్రలోభాలకు లొంగాను, భయపడ్డాను అని అన్నారు. తాను ఏ ప్రలోభాలకు లొంగానని కానీ, భయపడ్డాను అని అన్నారని, అవేం జరగలేదన్నారు. మా పార్టీ నాయకుడిలో మార్పు వచ్చింది.. ఒకప్పుడు మా నాయకుడు అంటే భక్తి ఉండేది.. కానీ, ఇప్పుడు అది దేవుడి మీదకు వెళ్ళిందని మాజీ ఎంపీ విజయసాయి పేర్కొన్నారు.