Sajjala
Sajjala Ramakrishnareddy : ఏపీలో పీఆర్సీ వివాదం కొనసాగుతూనేవుంది. కొత్త పీఆర్సీపై ఇప్పటికే జీవోలు ఇచ్చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జీతాలు అకౌంట్ లో పడబోతున్నాయని చెప్పారు. ఇప్పుడు జీవోల్ని వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. ఉద్యోగుల ఆందోళనలు విరమించుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఆందోళనలు విరమించడం కుదరదని ఉద్యోగులు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ ఉందని తెలిపారు. సమస్యలపైనే మాట్లాడాలని ఉద్యోగుల్ని కోరామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు పీఆర్సీ వేశామని చెప్పామని పేర్కొన్నారు.
Chada Venkat Reddy : పేదలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలం : చాడ వెంకట్ రెడ్డి
కొంత ఆలస్యంగానైనా చర్చలు మొదలయ్యాయని తెలిపారు. మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. అశుతోష్ మిశ్రా రిపోర్టు బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని ప్రతిపాదనలు చేసింది.
జీతాల విషయంలో ప్రభుత్వానికి తొందర ఎందుకని ప్రశ్నించింది. చర్చలు జరిపి మళ్లీ చెబుతామని మంత్రులు కమిటీ వెల్లడించింది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచింది. ఈ సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తెలిపింది.