Chada Venkat Reddy : పేదలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలం : చాడ వెంకట్ రెడ్డి
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమి అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ విభజన హామీలను బడ్జెట్‌లో పేర్కొనలేదన్నారు.

Chada Venkat Reddy
Chada Venkat Reddy criticized union budget-2022 : కేంద్ర బడ్జెట్ పై అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే.. విపక్ష పార్టీలతోపాటు పలువురు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్లుగా ఉన్నదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రెండేళ్ళుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికి ఇండ్లు అనే వాగ్ధానాలకు గతిలేదని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కొనసాగిస్తూ త్వరలో ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకొస్తామని ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు.
CM KCR : కేంద్ర బడ్జెట్ కు దశ, దిశ లేదు : సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమి అయ్యిందని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ, తదితర విభజన హామీలను బడ్జెట్‌లో పేర్కొనకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని చెప్పారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల అనుసంధానం పేరుతో రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం తన పెత్తనాన్ని ప్రదర్శించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాలు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేశాయని వెల్లడించారు. మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించిన అంత్రాష్ట వివాదాలను కేంద్ర ప్రభుత్వం త్వరతగతిన నిష్పాక్షికంగా పరిష్కరిస్తే సరిపోతుందన్నారు.