Manipur Violence(Photo : Google)
Manipur Violence : అంతర్గత ఘర్షణలతో, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. గిరిజన తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హింసను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు చదువు నిమిత్తం మణిపూర్ కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లల క్షేమ సమాచారం కోసం ఇక్కడ తల్లిదండ్రులు కూడా కంగారుపడుతున్నారు.
మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం రంగంలోకి దిగంది. మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. మణిపూర్ లో ఆంధ్ర విద్యార్థుల సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ ను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. అలాగే, సహాయ పర్యవేక్షణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారి మైఖేల్ అంఖమ్ ను నియమించింది.(Manipur Violence)
Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు
మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అటు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్ లైన్ ను వివియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. కాగా, మణిపూర్‌లోని పలు యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారుల అంచనా వేశారు. అక్కడ తమ పిల్లలు చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. పిల్లలను క్షేమంగా ఏపీకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.(Manipur Violence)
సాయం కోసం చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు.. 011-23384016, 011-23387089.
మణిపూర్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ : 8399882392, 9436034077, 7085517602 (Manipur Violence)
విద్యార్థులకు సాయం చేసేందుకు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు ప్రకటించిన ప్రభుత్వం..
1. 8399882392 – MN Michael Achom, IRS
2. 9436034077 – Rehanuddin Choudhury, Joint Secretary (Home)
3. 7005257760 – Peter Salam, Joint Secretary (Home)
4. 8794475406 – Dr. Th. Charanjeet Singh, Joint Secretary (Home)
5. 8730931414 – Dr. Mayengbam Veto Singh, Deputy Secretary (Home)
6. 7085517602 – S. Rudranarayan Singh, DSP(Home)(Manipur Violence)
Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్
మణిపూర్‌లో మారణహోమం..
గిరిజన, గిరిజనేతర తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు హింసకు దారిశాయి. మణిపూర్ మారణహోమంలో 54 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి అదుపు తప్పింది. షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతై వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. ఈ నెల 3న చురచంద్‌పూర్ జిల్లా టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) ర్యాలీ నిర్వహించగా, అది హింసాత్మకంగా మారిన విషయం విదితమే.(Manipur Violence)
మొత్తం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతైలు ఎక్కువగా ఇంఫాల్ వ్యాలీలో నివసిస్తున్నారు. జనాభాలో 40 శాతం మంది వరకూ నాగాలు, కుకీలు సహా గిరిజనుల ఉన్నారు. వీరు ఎక్కువగా వ్యాలీ చుట్టూ ఉన్న కొండప్రాంత జిల్లాల్లో నివసిస్తున్నారు. కాగా, ఆర్మీని రంగంలోకి దింపడంతో పాటు అసోం రైఫిల్స్ కీలక ప్రాంతాల్లో మోహరించడంతో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది.
ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విద్యార్థులంతా తమ గదులకే పరిమితమయ్యారు. తిదుకు తిండి కూడా దొరక్క ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. అటు, తెలంగాణ ప్రభుత్వం కూడా మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 250 మంది విద్యార్థులను విమానం ద్వారా మణిపూర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.