Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.

Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

Gone prakash cm jagan

Gone Prakash Rao :  ఆంధప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులపైనా.. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ పైనా.. మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాండురంగ మహత్యం, వాల్మీకి సినిమాలు చూడాలంటూ సూచించారు. అలాగే రాజశేఖర్ రెడ్డికి జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు.

తిరుపతిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతు గోనె ప్రకాశ్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే తాను సమాధానం చెప్పానని చెబుతునే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలకు.. ముఖ్యంగా సీఎం జగన్ (CM Jagan) పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డికి జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ ఏద్దేవా చేశారు. అవినీతి విషయంలో జగన్ కు జరిమానా పడుతుంది అని మాత్రమే చెప్పానని.. జగన్, భారతి జైలుకు వెళ్తారని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతు నేను బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించానని అంటున్నారని కానీ తాను బాలినేనిపై ఎటువంటి విమర్శలు చేయలేదని, కించపరచలేదని తెలిపారు. భారతి కోసమే షర్మిళ, విజయమ్మను జగన్ దూరంగా పెట్టారని ఆరోపించిన గోనె ప్రకాశ్ మరోసారి జగన్ పై విమర్శలు చేస్తూ.. జగన్ తల్లి అని కూడా చూడకుండా విజయమ్మ ని ఏడిపించారు. రాజకీయాల్లో వాటా మాది ఆస్తిలో వాటా మీది అన్నారని అన్నారు. బాబాయిని చంపితే దిక్కులేదని, నిందితులను రక్షించే పనిలో జగన్ ఉన్నారని.. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మాత్రం సాగనంపేశారు అంటూ ఎద్దేవా చేశారు.

Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

ఈ సందర్భంగా గోనె ప్రకాశ్ రావు ఏపీ రాజకీయాల గురించి.. రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిపారు. ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన (JanaSena) కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని జోస్యం చెప్పారు.