AP Teacher Posts : ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 2260 టీచర్ పోస్టులకు ఆమోదం..

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.

AP Teacher Posts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వేల 260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో కొత్తగా 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read : విజయసాయిరెడ్డికి షాక్.. విచారణకు రావాలంటూ సిట్‌ నోటీసులు

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అటు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ (రాజీవ్ రంజన్ మిశ్రా) గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025 మే 10వ తేదీ వరకూ ఏకసభ్య కమిషన్ గడువు పెంచుతూ ఆదేశాలిచ్చింది.

 

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
* అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం
* రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం
* ఏపీలో 2వేల 260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు ఆమోదం
* హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినట్టుగానే ఏపీలో ప్రణాళికలు
* సకల సౌకర్యాలతో రాజధాని నిర్మాణం
* మత్స్యకారులకు ఇచ్చే సాయం మరో 10వేలు పెంపు

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here