Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి షాక్.. విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు.

మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read: దుబాయిలో పాకిస్థాన్ వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు తెలంగాణ వాసులు
ఈ కేసులో ఏప్రిల్ 18న విజయవాడలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డికి సిట్ చెప్పింది. మద్యం కుంభకోణంపై సిట్ ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో నిన్న సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని 3 ప్రాంతాల్లో 50 మంది సిట్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు. ఆయన ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. కసిరెడ్డిని విచారిస్తే ఈ కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.