దుబాయిలో పాకిస్థాన్ వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు తెలంగాణ వాసులు
బేకరీలో పనిచేసే వారు ఎవరైనా ఈ హత్యల గురించి ఎవరికైనా ఎటువంటి వివరాలు అందించినా ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

దుబాయిలో ఓ పాకిస్థాన్ వ్యక్తి చేతిలో ఇద్దరు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. అష్టపు ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ అనే వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. మరో ఇద్దరిని కూడా గాయపరిచాడు.
ప్రేమ్‌సాగర్ సొంత ప్రాంతం నిర్మల్ జిల్లా సోన్ మండలం. శ్రీనివాస్‌ది నిజామాబాద్ జిల్లా. పాకిస్థానీ చేతిలో గాయాలపాలైన మరో ఇద్దరు కూడా తెలుగువారే. నిందితుడితో పాటు మిగతా నలుగురు దుబాయిలోని ఒకే బేకరీలో పని చేస్తున్నారు.
Also Read: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సు చేసిన యువకుడు
ఆ పాకిస్థానీ తోటి వర్కర్లపై దాడులు చేయడానికి పని ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాగే, నిందితుడు తోటి వర్కర్లపై దాడికి పాల్పడ్డ అనంతరం మతపరమైన నినాదాలు కూడా చేసినట్లు సమాచారం. వారు పనిచేసే బేకరీ యాజమాన్యం ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా చేసినట్లు తెలిసింది.
బేకరీలో పనిచేసే వారు ఎవరైనా ఈ హత్యల గురించి ఎవరికైనా ఎటువంటి వివరాలు అందించినా ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ బేకరీలో చాలా మంది తెలంగాణ వారు పనిచేస్తుంటారు. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.