గుడ్‌న్యూస్.. ఏపీలో ఎన్నికల వేళ పెన్ష‌న్ల పంపిణీపై స‌వ‌రించిన విధివిధానాలు జారీ

లబ్ధిదారుల్లో కొందరికి ఇంటివ‌ద్దకే పెన్ష‌న్ న‌గదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారు..

pension

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పెన్ష‌న్ల పంపిణీపై స‌వ‌రించిన విధివిధానాలు స‌ర్కార్ జారీ చేసింది. మంగళవారం మ‌ధ్యాహ్నం నుంచి ఈ నెల 6లోగా పెన్ష‌న్లు పంపిణీ చేయాల‌ని ఆదేశించింది. కేట‌గిరీల వారీగా పెన్ష‌న్ల పంపిణీకి విధివిధానాలను రూపొందించింది.

లబ్ధిదారుల్లో కొందరికి ఇంటివ‌ద్దకే పెన్ష‌న్ న‌గదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారు వారి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వ‌ద్ద పెన్షన్లు అందుకోవచ్చు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం తో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, వృద్ధ వితంతువుల‌కు ఇంటివ‌ద్దే పెన్షన్ అందుకోవచ్చు. గ్రామ స‌చివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు జరగనున్నాయి.

స‌చివాల‌య సిబ్బందిలో కొంత‌మందికి బీఎల్వోలుగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల విధులు అప్ప‌గించింది స‌ర్కార్. పెన్షన్ల పంపిణీ కోసం సిబ్బంది సరిపడా లేక‌పోవ‌డంతో రెండు కేట‌గిరీలుగా పెన్ష‌న్ల పంపిణీకి నిర్ణ‌యం తీసుకుంది. పెన్ష‌న్ల పంపిణీ స‌మ‌యంలో ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ స‌చివాల‌యాలు ప‌నిచేయనున్నాయి.

Also Read: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. పవన్‌పై ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు