ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. పవన్‌పై ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా?

Congress: కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు.

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. పవన్‌పై ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా?

YS Sharmila

AP Congress 1st List: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితాని ఏఐసీసీ ఇవాళ విడుదల చేసింది. మొత్తం 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్‌సభ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు.

కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు. కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ బరిలో దిగనున్నారు. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఎంపీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది.

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు
చింతల పూడి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎలీజా పోటీకి దిగుతున్నారు. ఆయన ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. నందికొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్ కు టికెట్ దక్కింది. ఆయన కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతే.

చంద్రబాబుపై ఆవుల గోవిందరాజులు పోటీ
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌పై మదేపల్లి సత్యానంద రావు పోటీ చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబుపై ఆవుల గోవిందరాజులు పోటీ చేస్తారు. నగరిలో రోజాపై పోచారెడ్డి రాకేశ్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. శింగనమల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. ఇప్పటికే ఇతర ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి.

అభ్యర్థులు వీరే..

ఏపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

Also Read: తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్