తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్

మొన్నటి వ‌ర‌కు బీఆర్ఎస్‌లో కీల‌క నేత‌లుగా ఉండి.. కాస్త ప్రజాబ‌లం ఉన్న నేత‌లు కాంగ్రెస్ ఆక‌ర్ష్‌లో ఉన్నార‌ని టాక్. ఎప్పటికి పార్టీని వీడ‌ర‌ని పేరున్న నేత‌లు ఆక‌ర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.

తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్

Congress Operation Akarsh: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్. ఓవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌తో అపోజిషన్‌ ను వీక్ చేస్తూనే.. మరోవైపు బలమైన నేతలను బరిలోకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కారు దిగారు. మరికొందరు గులాబీ నేతలు కూడా రేవంత్‌కు టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు.

రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం..
బీఆర్ఎస్ ఊహించని విధంగా కే.కేశవరావు, కడియం శ్రీహరి లాంటి నేతలకు వల వేశారు రేవంత్. వ‌రంగ‌ల్ ఎంపీగా క‌డియం కావ్య, సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ నుంచి బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైంది. మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వ‌ర‌కు బీఆర్ఎస్‌లో కీల‌క నేత‌లుగా ఉండి.. కాస్త ప్రజాబ‌లం ఉన్న నేత‌లు కాంగ్రెస్ ఆక‌ర్ష్‌లో ఉన్నార‌ని టాక్. పార్టీ మారతారని ప్రచారం లేని వారు.. ఎప్పటికి పార్టీని వీడ‌ర‌ని పేరున్న నేత‌లు ఆక‌ర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.

Also Read: తెలంగాణలో వలసల రాజకీయం.. టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏంటి?

బీఆర్ఎస్ కీలకనేతలపై ఫోకస్
తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. అందుకోసం తమకు బలమైన అభ్యర్థులు లేరనుకున్నచోట నేతలను చేర్చుకుంటున్నారు. సేమ్‌టైమ్‌ ఎంపీ అభ్యర్థి గెలవడానికి కావాల్సిన రాజకీయ బలాన్ని కూడా సమకూర్చుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలకనేతలపై కూడా ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.