Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు

రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Amaravati Lands : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజధాని అభివృద్ధికి నిధుల సేకరణలో భాగంగా రాజధాని భూముల విక్రయానికి ఏపీ సర్కార్ ప్రణాళిక రూపొందించింది.

AP Capital: ఏపీ రాజధాని అమరావతే

తొలి విడతలో 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. దీని ద్వారా 2వేల 480 కోట్ల రూపాయలు సేకరించాలని నిర్ణయించింది. తదుపరి.. ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది సీఆర్డీఏ.

AP High Court : రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పురపాలక శాఖపై ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం భూముల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో సొంతంగా నిధుల సమీకరణకు సీఆర్డీఏ భూముల విక్రయానికి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది.

నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలోని భూములను విక్రయానికి పెట్టే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం శనివారం సాయంత్రం విడుదల చేసింది. 389 జీవో ప్రకారం మొదటి విడతలో దాదాపు 248.3 ఎకరాల భూములను అమ్మనుంది. దీంతో 2వేల 480 కోట్లు రూపాయల నిధులను మొదట విడతగా సేకరించనుంది.

భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనుంది ప్రభుత్వం. దశలవారిగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను అమ్మేసి వాటి ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల ల్యాండ్ విక్రయించనుంది.

ట్రెండింగ్ వార్తలు