AP Capital: ఏపీ రాజధాని అమరావతే

మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత అమరావతి రాజధాని అంటూ తమకు సమాచారం ఇచ్చారని, అనంతరం 2020లో 3 రాజధానులుగా చేశారని వివరించారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం,

AP Capital: ఏపీ రాజధాని అమరావతే

AP Capital

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఏంపీ జీవీఎల్ వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం జరిగిన సమావేశంలో ఎంపీ జీవీఎల్..ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత అసలు రాజధాని ఏదో తెలియడం లేదన్నారు. ఏపీ రాజధాని ఏదో కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు. రాజధానిపై ఎవరు నిర్ణయం తీసుకోవాలని ఎంపీ జీవీఎల్  ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని..కేంద్రం స్పష్టం చేసింది. మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత అమరావతి రాజధాని అంటూ తమకు సమాచారం ఇచ్చారని, అనంతరం 2020లో 3 రాజధానులుగా చేశారని వివరించారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని చెప్పారన్నారు. తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.

Read More : Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్

ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.