AP Property Tax: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఇవాళ్టితో ముగియనున్న స్పెషల్ ఆఫర్

ఆస్తి పన్ను చెల్లింపుదారులు మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Property Tax

AP Property Tax: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ గత వారంరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.

Also Read: Highway: హైదరాబాద్- విజయవాడ హైవేపై వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ మూడు చోట్ల తగ్గిన టోల్ ఛార్జీలు

ఆది, సోమవారాల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు పనిచేసేలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ITR Filing : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. పాత లేదా కొత్త పన్ను విధానంలో ITR ఎలా ఫైల్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఉగాది, రంజాన్ పండుగలు కావడంతో తగిన సిబ్బంది ఉండేలా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఆస్తి పన్నుల చెల్లింపు కౌంటర్లు పనిచేశాయి. ఇవాళ చివరి తేదీ కావటంతో ఇవాళకూడా ఆస్తిపన్నుల కౌంటర్లు యథావిధిగా పనిచేయనున్నాయి. ఆన్ లైన్ లోనూ పన్నులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇవాళ చివరి తేదీ కావటంతో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వడ్డీలో 50శాతం రాయితీ పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు.