Free Bus Ride Scheme : ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ పథకంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు.
ఇటు ఇప్పటికే ఈ స్కీమ్ అమల్లో ఉన్న కర్నాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తున్న అధికారులను త్వరగా నివేదిక అందించాలని ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా దశలవారిగా అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. సూపర్ సిక్స్ లో ప్రధానమైన ఎన్నికల హామీ.. ఉచిత బస్సు పథకం. మహిళల కోసం ఇచ్చిన ఈ స్కీమ్ ను ఉగాది నుంచి అమలు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read : జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా?
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేదానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. దీంతో ఈ స్కీమ్ పై ఇప్పటివరకు చేసిన కసరత్తును ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.