జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా?
రాయలసీమలోనే వైసీపీని దెబ్బకొట్టాలనేది పవన్ వ్యూహమట. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలని కసిగా ఉన్నారట.

Pawan and Jagan
అప్పుడు ఆయన సీఎం..ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం. ఇప్పుడా నేత అపోజిషన్ లీడర్..ఈ నేతది ప్రభుత్వంలో కీరోల్. ఇలా అపోజిషన్‌లో ఉన్నా..పవర్‌లో ఉన్నా.. పొజీషన్లు మారినా..మాజీ సీఎం జగన్‌ను మాత్రం వదలడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇష్యూ ఏదైనా..ఇచ్చేపడేస్తానంటూ వైసీపీని, జగన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నానికి మరింత పదును పెడుతున్నారు జనసేనాని.
కడప జిల్లా గాలివీడు ఘటనపై ఇమీడియేట్లీ రియాక్ట్ అయ్యారు పవన్. అంతేకాదు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి దాడికి గురైన ఎంపీడీవోను పరామర్శించి..ఏకంగా జగన్‌నే డైరెక్టుగా టార్గెట్ చేసి కామెంట్ చేశారు పవన్. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే జగన్‌ను కాస్త గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అధఃపాతాళానికి తొక్కకపోతే అడుగు జగన్ అంటూ ఛాలెంజ్ చేసి..వైసీపీని ఘోరంగా ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు కడప జిల్లా గాలివీడులో ఎంపీడీవో మీద దాడి ఘటనపై అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు పవన్. మీ వారిని కంట్రోల్‌లో పెట్టుకో జగన్ అంటూ సూటిగానే చెప్పేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. జగన్ పార్టీ వాళ్లు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హాట్ హాట్‌గానే హెచ్చరించారు పవన్.
జగన్‌ను సూటిగా అటాక్
అంతేకాదు రాయలసీమ మీ జాగీరు కాదు, ఎవరికీ ఇక్కడ కోటలు లేవంటూ..జగన్‌ను సూటిగా అటాక్ చేశారు. తాను అన్నింటికీ తెగించి వచ్చిన వాడినంటూ ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసంటూ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తాను స్వయంగా కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ అన్ని లెక్కలూ సరిచేస్తానంటూ ఘాటైన హెచ్చరికనే జారీ చేశారు. ఇలా పవన్ మరోసారి వేడిగా వాడిగా కామెంట్స్ చేయడం వెనక వ్యూహమేంటి అన్న చర్చ సాగుతోంది.
నిజానికి చంద్రబాబు, జగన్ మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. కానీ చంద్రబాబు, లోకేశ్ కంటే ఎక్కువగా..జగన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు పవన్. ఆ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ సమయంలో జగన్ మాట్లాడిన తీరుపై కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. IAS అధికారులను బెదిరించే వారిపై సుమోటో కేసులు పెడతామంటూ జగన్‌ను హెచ్చరించారు.
అధికారులపై చిన్నగీటు పడినా చూస్తూ ఊరుకోమంటూ..IAS అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు పెడతామని రెండు నెలల క్రితమే చెప్పారు. అన్నట్లుగానే గాలివీడు ఎంపీడీవో ఘటనపై త్వరగా రియాక్ట్ అయ్యారు. మొన్నామధ్య జగన్ సరస్వతి కంపెనీకి చెందిన భూముల విషయంలోనూ సర్వే చేయించారు పవన్. సోషల్ మీడియా పోస్టులపై కూడా పవనే ముందుగా స్పందించారు.
జగన్‌ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం?
అయితే సేనాని మాటి మాటికి పవన్..జగన్‌ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఓటు బ్యాంక్‌ను ఎంత తగ్గిస్తే అంతలా అది జనసేనకు కలసి వస్తుందనే స్కెచ్‌తో ఉన్నారట. వైసీపీ నేతలు టీడీపీకి యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్లు పార్టీ మారాలనుకుంటే..జనసేనవైపు అయితే వెళ్ళేందుకు మొగ్గు చూపొచ్చన్న అంచనా ఉంది. అందుకే జగన్‌ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని వీక్ చేసి..తన పార్టీ బలం పెంచుకునే ప్లాన్‌లో పవన్ ఉన్నారట. అప్పుడు తానే వైసీపీకి, జగన్‌కు అసలైన ప్రత్యర్థిగా ఉండాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
మరోవైపు రాయలసీమలోనే వైసీపీని దెబ్బకొట్టాలనేది పవన్ వ్యూహమట. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలని కసిగా ఉన్నారట. వైసీపీని మళ్లీ బలపడకుండా చేయాలంటే..రాయలసీమలోనే బ్రేకులు వేయాలని చూస్తున్నారట. సిచ్యువేషన్ చూస్తుంటే పవన్ కడపలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్స్ట్. అదే జరిగితే అప్పుడు డైరెక్ట్‌గానే పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా పొలిటికల్ వార్ కొనసాగడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల