AP Govt: నేడు బ్యాంకు ఖాతాలలో జమ కానున్న రైతు భరోసా నగదు!
ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి...
- Naresh Mannam
- Published On : October 26, 2021 / 06:48 AM IST
Ap Govt
AP Govt: ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పునఃప్రారంభించిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు.
AP Govt: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. వచ్చే నెలలోనే ప్రారంభం!
నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. రైతుభరోసా కింద మొత్తం 12 వందల 13 కోట్లు జమకానున్నాయి. రెండో విడత కింద ఖరీఫ్ పంట కోత సమయం అక్టోబర్ నెల ముగిసేలోపు, రబీ అవసరాల కోసం రూ.4 వేలు చొప్పున జమ చేస్తారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.112.7 కోట్ల వడ్డీ రాయితీ జమ చేయనున్నారు.
AP Govt : పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ
దీంతో పాటు లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 17 వందల 20 రైతు గ్రూపులకు 25.55 కోట్ల రూపాయల నిధులు నేడు జమ కానున్నాయి.
