AP Govt : పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ

పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

AP Govt : పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ

High Court

High Court reject House motion Petition : పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. నవరత్నాలు, పేదల ఇళ్ల నిర్మాణంపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ… ఏపీ సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్‌ బెంచ్‌ కూడా సింగిల్‌ బెంచ్‌ తీర్పునే సమర్థించింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టొద్దని ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ పథకం కింద పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

పేదలకు ఇళ్ల కేటాయింపును తాము వ్యతిరేకించట్లేదన్న ధర్మాసనం.. కేవలం మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్లు కేటాయించాలని సూచించింది. గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ, గృహనిర్మాణం, పర్యావరణ శాఖలోని నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశించింది. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

AP Coal : విద్యుత్ సంక్షోభం, ఆ సమయంలో…ఏసీలు ఆపేయండి

ఈ నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక… గృహ నిర్మాణాలు చేపట్టాలని తేల్చి చెప్పింది. అప్పటిదాకా కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. అంతేకాదు.. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 3 జీవోల్లోని పలు నిబంధనల్ని కొట్టేసింది. దీనిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను తీసుకునేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.