AP Coal : విద్యుత్ సంక్షోభం, ఆ సమయంలో…ఏసీలు ఆపేయండి
సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రజలను ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కోరారు.

Ap Coal
Avoid AC : విద్యుత్ సంక్షోభం అందరినీ కలవరపెడుతోంది. బొగ్గు, గ్యాస్ నిల్వలు తక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఏపీ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యను పరిష్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో…ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు రోజులుగా రద్దీ సమయాల్లో…కొన్ని ప్రాంతాల్లో కోతలు అమలువుతున్నాయని, సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
Read More : Ashish Mishra Arrest : లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్
సాయంత్రం సమయంలో…అధిక ధరపై విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి భవిష్యత్ లో సర్దుబాటు ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే..రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందని, కోవిడ్ కు ముందు అక్టోబర్ రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే..ఇప్పుడు 195 మిలియన్ యూనిట్లు అవసరం అవుతోందన్నారు. బొగ్గు కొరత కారణంగా…థర్మల్ ప్లాంట్ లలో 40 మిలియన్ మేర ఉత్పత్తి తగ్గిందని, పవన విద్యుత్ రెండు, మూడు మిలియన్ యూనిట్లకు మించి రావడం లేదన్నారు.
Read More : Men serving Tea: ఆడాళ్లకు టీ సర్వ్ చేయడం.. మహిళలు పిజ్జా తినడం టీవీల్లో సెన్సార్
ప్రస్తుతం ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి, రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళితే…శుక్రవారం నుంచి అయిదు ర్యాక్ ల బొగ్గు అందుబాటులోకి వచ్చిందన్నారు. డిమాండ్ పెరగడంతో…నెల నుంచి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ రేట్లు భారీగా పెరిగాయన్నారు. డబ్బు పెట్టినా విద్యుత్ దొరకడం లేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎక్కువ తక్కువ ధరకు దొరికితే…అక్కడే కొంటామని వెల్లడించారు.