AP Govt: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా..

AP Govt: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

Ap Govt

AP Govt: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా చేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఒక్కొక్కటి వీటి పరిధిలోకి తీసుకొస్తుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించి ఎన్నో పనులను ఈ సచివాలయాలలో నిర్వహిస్తుండగా త్వరలో రిజిస్ట్రేషన్లను కూడా ఇక్కడే చేసే విధంగా ప్రయత్నాలు మొదలు కానున్నాయి.

Today Gold Price : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

ఇందుకోసం ముందుగా రాష్ట్రంలోని 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చే నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించబోతున్నారు. దీనికోసం అధికారులు సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సచివాలయ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇతర సిబ్బందికి ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై శిక్షణ ఇస్తున్నారు. భూముల రీ-సర్వే జరిగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను నవంబరు 3వ వారంలో ప్రారంభించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్న నేపథ్యంలో.. సచివాలయాల్లోనూ ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానం అమలుకు చర్యలు తీసుకోనున్నారు.

Telangana HC: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జడ్జీల ప్రస్థానం ఇదే!

ప్రస్తుత విధానం అమల్లో ఉన్న లోపాలు, అవకతవకలను పరిగణనలోనికి తీసుకుని ఎనీవేర్‌ విధానాన్ని ఇప్పటికంటే మరింత పటిష్టం చేయాలని సంబంధిత వర్గాలు పేర్కొంటుండగా.. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోని ఆనంద్‌నగర్‌, పటమట, ఇతర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానం కింద ఎవరైనా ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి సీనియర్‌ ఉద్యోగి ఒకరు కొంతకాలం పాటు సచివాలయాల్లో పనిచేసే అవకాశం ఉంది.

Maoist Leader RK: చంద్రబాబుపై దాడి కేసు నిందితుడు.. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సచివాలయ కార్యదర్శి స్కాన్‌చేసి, వారి పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్లకు పంపితే వారు పరిశీలించి, అనుమతి ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకునే విధానాన్నీ పరిశీలిస్తున్నారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలును సచివాలయాల్లో ప్రారంభించాలా? వద్దా? అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ వెల్లడించగా.. ముందుగా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు అవసరాలకు తగ్గట్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.