Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. పండుగలు, పెళ్లి ముహుర్తాలు ఈ సమయంలో అధికంగా ఉంటాయి

Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

Gold For Rs 100

Gold Price Today  : సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. పండుగలు, పెళ్లి ముహుర్తాలు ఈ సమయంలో అధికంగా ఉంటాయి కాబట్టి బంగారం కొనుగోళ్లు మిగతా నెలలతో పోల్చితే కొంచం ఎక్కువే. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బంగారం ధరలు పైపైకి వెళ్తుంటాయి. అందుకే సెప్టెంబర్ వరకు కొద్దిగా తగ్గినట్లు కనిపించిన బంగారం ధర.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తుంది. విజయదశమి వేళ మహిళలకు షాకిస్తూ… ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు సైతం స్పల్పంగా పెరిగాయి. మరి హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

బంగారం ధరలు:

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550 పెరిగి రూ.44,700గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.48,760 చేరింది.

దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,050గా ఉంది.
ముంబైలో రూ.46,970,
ఢిల్లీలో 46,850
బెంగళూరులో రూ.44,700
తిరువనంతపురం 44,700
అహ్మదాబాద్‌లో 45,580
జైపూర్‌లో 47,000గా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

చెన్నైలో 49,140
ముంబైలో 47,970
ఢిల్లీలో రూ.51,110
కోల్కతాలో రూ.50,000
బెంగళూరులో రూ.48,760
తిరువనంతపురం 48,700
అహ్మదాబాద్‌లో 49,720
జైపూర్‌లో 49,250గా ఉన్నాయి.

అక్టోబరు 7 నుంచి బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గత 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గగా… నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో వెండి ధరలు:

హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.66,600కి లభిస్తోంది. 10 గ్రాముల ధర రూ.666 గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల వెండి ధర రూ.8 పెరిగింది. ప్రసుతం ఒక్క గ్రాము వెండి 66.60కి దొరుకుతోంది.

దేశవ్యాప్తంగా వెండి ధరలు

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.666గా ఉంది. హైదరాబాద్, కేరళ, మధురైలో కూడా ఇదే రేటుకు దొరుకుతోంది. ఇక ముంబై న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు,పుణె, అహ్మదాబాద్, జైపూర్‌లో రూ.632 లభిస్తోంది. వెండి ధరలు గత పది రోజుల్లో నాలుగు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. ఐదు రోజులు స్థిరంగా ఉన్నాయి.