Maoist Leader RK: చంద్రబాబుపై దాడి కేసు నిందితుడు.. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్ట్ అగ్రనేత ఆర్‌కే కన్నుమూశారు. ఆర్‌కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది.

Maoist Leader RK: చంద్రబాబుపై దాడి కేసు నిందితుడు.. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

Maoist

Maoist Top Leader RK: మావోయిస్ట్ అగ్రనేత ఆర్‌కే కన్నుమూశారు. ఆర్‌కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది.

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అలియాస్‌ సాకేత్ దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే తుదిశ్వాస విడిచారని చెబుతున్నారు.

అయితే, ఆర్‌కే చనిపోయిన విషయాన్ని మావోయిస్ట్ నేతలు దృవీకరించలేదు. ఆర్కేపై ఇప్పటికే రూ. కోటి రివార్డు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో శాంతి చర్చలకు నేతృత్వం వహించారు ఆర్‌కే. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులుండగా.. బలిమెల ఎన్‌కౌంటర్‌ నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఈఘటనలో బుల్లెట్‌ గాయం అవ్వగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా పలుమార్లు తప్పించుకున్నాడు ఆర్కే. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే, నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు.