జాబ్ అలర్ట్ : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 1900 పోస్టులు

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలో 1900 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం)/ మల్టీ

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 03:11 AM IST
జాబ్ అలర్ట్ : ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 1900 పోస్టులు

Updated On : February 5, 2019 / 3:11 AM IST

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలో 1900 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం)/ మల్టీ

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలో 1900 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం)/ మల్టీ పర్పస్ హెల్త్  అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) పోస్టులు భర్తీ చేయనుంది. 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తుతోపాటు.. దరఖాస్తు ఫీజుగా రూ.300 రూపాయలతో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో నిర్ణీత గడువులోగా  సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

 

మొత్తం పోస్టులు : 1900

 

జిల్లాల వారీగా ఖాళీలు :
* శ్రీకాకుళం                52
* విజయనగరం           29
* విశాఖపట్నం          150
* తూర్పు గోదావరి     227
* పశ్చిమ గోదావరి     193
* కృష్ణా                    168
* గుంటూరు             242
* ప్రకాశం                  99
* నెల్లూరు               176
* చిత్తూరు              182
* కడప                   97
* అనంతపురం       140
* కర్నూలు            145

* క్వాలిఫికేషన్: టెన్త్ కాస్ల్ పాస్
* ఏపీ నర్సింగ్ – మిడ్‌వైవ్స్ కౌన్సిల్ నుంచి ఎంపీహెచ్‌ఏ కోర్సు (18/24 నెలలు) చేసి ఉండాలి.
* (లేదా) ఇంటర్ ఒకేషనల్ (ఎంపీడబ్ల్యూహెచ్) కోర్సు పూర్తిచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి.
* వయోపరిమితి: 2019 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి గరిష్ఠంగా 42 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపులు
* పేస్కేల్ : రూ.21,230- రూ.63,010.
* దరఖాస్తు ఫీజు: రూ.300.
* అభ్యర్థులు ‘Commissioner of Health & Family Welfare, AP, Gollapudi, Vijayawada’ పేరిట నిర్ణీత మొత్తంలో డిడి తీయాలి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు
* దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు డిడి జతచేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో సమర్పించాలి.
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 ఫిబ్రవరి 2వ తేదీ
* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 2019 ఫిబ్రవరి 20
Notification: http://cfw.ap.nic.in/pdf/MPHA%20(F)%20Notification.pdf
వెబ్‌సైట్ : http://cfw.ap.nic.in/

Applications : http://cfw.ap.nic.in/ANMMPHA(F).html