YS Jagan Passport : ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట.. 5 ఏళ్లకు పాస్‌పోర్టు జారీకి ఆదేశం!

YS Jagan Passport : 5 ఏళ్ల వ్యవధికి జగన్‌కు పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

YS Jagan Passport

YS Jagan Passport : ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఊరట దక్కింది. 5 ఏళ్ల వ్యవధికి జగన్‌కు పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. 2024 ఆగస్టులో వైఎస్ జగన్ తన కుమార్తెల పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లేందుకు రెగ్యులర్ పాస్‌పోర్టు జారీ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. 5 ఏళ్ళకి పాస్‌పోర్టు మంజూరు చేయాలని అందుకు ఎన్వొసీని ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల కోర్టును జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయించారు.

Read Also : Tammineni Sitaram: తమ్మినేని సీతారాంకి సోషల్‌ మీడియా సెగ!

పాస్ పోర్ట్ మంజూరు చేయాలంటే 20వేల పూచీకత్తుతో పాటు ప్రత్యక్షం హాజరుకావాలని వైఎస్ జగన్‌కి గతంలోనే ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సోమవారం వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యక్షంగా హాజరు కావాలని 20వేల పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దాంతో వైఎస్ జగన్‌కు ఊరట దక్కింది.

ఐదేళ్ల పాస్‌పోర్టు జారీకి నిరంభ్యంతర పత్రాన్ని కూడా ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందు ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించగా, ఆ కోర్టు ఉత్తర్వులపై ప్రజాప్రతినిధుల కోర్టు స్టే విధించింది. ఇందులో ఏడాది రెన్యువల్ చేసేందుకు మాత్రమే అంగీకరించింది. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది. రూ. 20 వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు సూచించింది. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

గత సెప్టెంబర్‌లో విదేశాలకు వెళ్లేందుకు ఆయన పాస్‌పోర్టు రెన్యువల్ కోసం అభ్యర్థించారు. ఐదేళ్లకు రెన్యువల్ చేయాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశాలను జత చేశారు. ఆ కేసులో ఎన్‌వోసీ తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే జగన్ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, విజయవాడ కోర్టు జగన్ పిటిషన్ కొట్టేసింది. కేవలం ఒక ఏడాది మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు అంగీకరించింది. రూ. 20వేల పూచీకత్తు ప్రత్యక్షంగా హాజరై ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also : అందుకే నాపై అక్రమ కేసు పెట్టారు: ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ కామెంట్స్‌