అందుకే నాపై అక్రమ కేసు పెట్టారు: ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ కామెంట్స్
"పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను" అని అన్నారు.

తనపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసుపై ఇవాళ రాత్రి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను. నాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కులను వినియోగించుకుంటాను. సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తాం. నా హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యాను. విచారణకు లాయర్లతో రావద్దని చెబుతున్నారు. న్యాయవాదుల సమక్షంలతో విచారణ జరిగితే తప్పేంటి? ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతాను. ఏ విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధమే. ఈ కేసులో చర్చకు సిద్ధం. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం కాంగ్రెస్ విధానం
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్ కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. నేను ఏ తప్పూ చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధం. అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే రేవంత్ రెడ్డి పారిపోయారు” అని కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ కామెంట్స్
- అవినీతి పరులకు, అడ్డమైన పనులు చేసే వాళ్లకు ప్రతి పనిలో అవినీతి కనపడుతుంది
- పొలిటికల్ బ్రోకర్లు, రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన వాళ్లు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు
- పొద్దున నుంచి కాంగ్రెస్ వాళ్లు హడావుడి చేస్తున్నారు
- నా పైన పెట్టిన కేసు లొట్టపీసు కేసు రాజకీయ కక్ష సాధింపు కేసు
- హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తే కాంగ్రెస్ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు
- న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని రేపు హైకోర్టుకు వెళ్తున్నాం
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాము…విచారణకు వస్తుంది
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ మోబిలిటి కోసం ఈ-రేస్ నిర్వహించాను
- హైకోర్టు నాకు శిక్ష వేయలేదు.. నేను తప్పు చేశానని చెప్పలేదు
- 9 వ తేదీన ఏసీబీ విచారణకు వస్తాను కోర్టు అనుమతి ఇస్తే లాయర్లతో వెళ్తా
- ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు వెళ్తాను
- రాష్ట్రంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడండి
- బీజేపీ, కాంగ్రెస్ వేరు కాదు
- కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంలా బీజేపీ పని చేస్తోంది