AP Inter Supply Results 2026: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు(AP Inter Supply Results 2026) విడుదలయ్యాయి.
ap inter supplementary results 2026 direct link resultsbie ap gov in 1st 2nd year marks memo
-
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.
-
వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
-
లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
AP Inter Supply Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు(AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్సైట్ల ద్వారా, అలాగే వాట్సాప్ ‘మనమిత్ర’ (9552300009) నంబర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది రెండో ఏడాది విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయం కల్పించడంతో మొత్తం 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు. గతంలో అనుత్తీర్ణులైన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించి తమ విద్యా ప్రయాణాన్ని కొనసాగించే సువర్ణావకాశాన్ని పొందారు.
Anant Ambani: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ.. ఆలయానికి రూ.48 కోట్ల భారీ విరాళం
ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసిన 2,29,034 మందిలో 59% (1,35,435 మంది), సప్లిమెంటరీ రాసిన 1,09,003 మందిలో 39% (42,379 మంది) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసిన 91,303 మందిలో 53% (48,149 మంది), సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1,02,018 మందిలో 56% (57,327 మంది) విద్యార్థులు విజయం సాధించి తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
