AP Covid Update
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కొత్తగా 136 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 803 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది. దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 17 వేల 741 మందికి కొవిడ్ సోకగా, వారిలో 23 లక్షల 165 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు కోవిడ్ సంబంధిత కారణాలతో మరణించారు. ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14 వేల 726 కి చేరింది.
Also Read :Milan 2022 : INS విశాఖ నౌక జాతికి అంకితం.. అలరించిన యుద్ధ విన్యాసాలు
నిన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో ఐదు జిల్లాల్లో కేసులు సంఖ్య రెండంకెలకు చేరుకోలేదు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 26 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల, 30లక్షల 97 వేల 641 శాంపిల్స్ ను పరీక్షించినట్లు కోవిడ్ నియంత్రణ విభాగం తెలిపింది.
Ap Covid Up Date