AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.inలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫామ్‌లో మూడు ముఖ్య విభాగాలు ఉంటాయి. 1. వ్యక్తిగత వివరాలు, 2. విద్యార్హతలు, మీకు అర్హత ఉన్న పోస్టుల వివరాలు 3. ఫీజు చెల్లింపు వివరాలు. మొదటి రెండు విభాగాల్లో అభ్యర్థులు ఏదైనా తప్పుగా టైప్ చేస్తే సవరణలు చేసుకోవచ్చు, కానీ, ఫైనల్ సబ్మిషన్‌కు ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు డేటాలో ఎడిట్ చేసే అవకాశం లేదు.
Also Read: ఆకాశంలో స్మైలీ ఫేస్.. చూసేందుకు ఉన్న ఈ ఒకేఒక్క ఛాన్స్ మిస్ అవ్వకండి..
2024లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో అప్లై చేసిన అభ్యర్థులు, ఇప్పుడు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, కొత్తగా ఎంచుకున్న సబ్జెక్టులు లేదా అదనపు పోస్టులకు మాత్రం ప్రతి ఒక్కదానికి రూ.750 చెల్లించాలి. కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి స్థాయిలో ఫిల్ చేయాల్సి ఉంటుంది.
టెట్ అర్హత మార్కుల వివరాలు: ఓసీలకు కనీసం 60% (90 మార్కులు), బీసీలకు కనీసం 50% (75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు కనీసం 40% (60 మార్కులు) ఉండాలి.
అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అభ్యర్థి విద్యార్హతల ఆధారంగా అర్హతగల పోస్టులను చూపుతుంది. అభ్యర్థి ఆసక్తికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమం ఎంచుకోవాలి. ఒకసారి ఎంపిక చేసిన తర్వాత ఆర్డర్ మార్చే అవకాశం ఉండదు, కాబట్టి జాగ్రత్త అవసరం.
వయో పరిమితి, రిజర్వేషన్లు విషయానికి వస్తే.. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు (2024, జూలై 1 నాటికి) ఉండాలి. రిజర్వ్ క్యాటగిరీలకు వయోపరిమితి 49, దివ్యాంగులకు 54. ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ప్రత్యేక నిబంధనల ఆధారంగా వయోపరిమితి మినహాయింపు ఉంది. మొత్తం పోస్టుల్లో 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అమలు చేస్తారు.