ఆకాశంలో స్మైలీ ఫేస్.. చూసేందుకు ఉన్న ఈ ఒకేఒక్క ఛాన్స్ మిస్ అవ్వకండి..
శుక్రుడు, శని, చంద్రుడు స్మైలీ ఫేస్‌లా కనపడనున్నారు.

సోషల్ మీడియాలో “స్మైలీ”లను ఎంతగా ఉపయోగిస్తారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ చిన్నపాటి చిహ్నాల ద్వారా యూజర్లు తమ భావోద్వేగాల గురించి తెలుపుతారు. యూజర్‌కు నవ్వు వస్తే.. “పళ్లు తెరిచి ఉన్న స్మైలీ”ని సెండ్ చేస్తారు.
అలాగే, స్యాడ్ ఫేస్, లవ్, కూల్, క్రయింగ్, వింక్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను స్మైలీల ద్వారా తెలుపుతుంటాం. ఈ స్మైలీలను మనం కేవలం కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోనే చూస్తాం. లేదంటే చేతిలో పేపర్‌పై గీసినా కనపడతాయి.
మనిషి ప్రమేయం ఏమీ లేకుండా ఆకాశంలో స్మైలీ కనపడితే ఎలా ఉంటుంది. చాలా అద్భుతం కదూ. ఈ నెల 25న తెల్లవారుజామున ఇదే జరగనుంది. రెండు గ్రహాలు, చంద్రుడు సమీపంలోకి వచ్చి, ఆ మూడు కలిసి స్మైలీ ఫేస్‌లా కనపడతాయి. లైవ్ సైన్స్ వెబ్‌లో ఈ వివరాలు తెలిపారు. శుక్రుడు, శని, చంద్రుడు స్మైలీ ఫేస్‌లా కనపడనున్నారు.
సూర్యోదయానికి గంట ముందు కొద్దిసేపు ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా చూడొచ్చు. ఈ స్మైలీ ఫేస్ వంటి ఆకారంలో శుక్రుడు, శని కళ్లలా, నెలవంక నవ్వుతూ ఉన్న పెదాలుగా కనపడుతుంది. ఈ స్మైలీని పూర్తి స్థాయిలో చూడాలంటే స్టార్‌గేజింగ్ బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌ను వాడాలి.