Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి .. ఏపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీల్లేదని కేసీఆర్ చెప్పారు. మరి అటువంటప్పుడు అదే వ్యక్తి కొంటామని ఎలా అంటారు?అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...?అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు..

Visakha Steel Plant : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖ స్టీట్ ప్లాంట్ (Visakha Steel Plant)పై తెలంగాణ సర్కార్ (Telangana Government) దృష్టిపడింది. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం బిడ్ కూడా దాఖలు చేయనుంది. దీనిపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది మా ప్రభుత్వం స్టాండ్..మా స్టాండే అదైనప్పుడు మేము దాన్ని కొంటామా? అటువంటిది తెలంగాణ ప్రభుత్వం (BRS)కొoటే మీ స్టాండ్ ఎంటి అనే ప్రశ్నే లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీల్లేదని కేసీఆర్ అన్నారు. మరి అటువంటప్పుడు స్టీల్ ప్లాంట్ కొంటామని  మళ్ళీ వాల్లే ఎలా అంటారు? అంటే అమ్మేయమని వారి ఉద్ధేశ్యమా అని ప్రశ్నించారు.

కొనటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు అంటే స్టీల్ ప్లాంట్ ను అమ్మెయ్యమని వారి ఉద్దేశమా…?స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు KCR నుండి గాని,తెలంగాణ ప్రభుత్వం నుండి గాని అధికారిక స్టేట్మెంట్స్ వినలేదని..స్టీల్ ప్లాంట్ కొంటారనే వార్తలపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో క్లారిటీ రావాలని…వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియకుండా నేను ఏం మాట్లాడతాను అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల కోసం ఏవేవో మాట్లాడతారు..వాళ్ళ రాజకీయ విమర్శలకో…మరోదానికో మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు అమర్నాథ్.స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంటూ చెప్పుకొచ్చారు ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్.

Visakha Steel Plant: విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి.. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం.. ఈ నెలాఖరులో బహిరంగ సభ!

విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారని దాంట్లో భాగంగానే విశాఖ ఉక్కుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేయనుందనే వార్తలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి.విశాఖ ఉక్కుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేయనుంది.  ఈవోఐ (EOI) లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం ఏప్రిల 15వ తేదీ వరకు గడువు ఉంది. సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్ పాల్గొనాలని, ఇందులో భాగంగా విశాఖ ఉక్కు బిడ్డింగ్‌పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బృందం రేపు విశాఖ పట్టణం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న బీజేపీ సర్కారు‌కు బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా చూడాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఏపీలో సెగలు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు