Visakha Steel Plant: విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి.. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం.. ఈ నెలాఖరులో బహిరంగ సభ!

విశాఖ పట్టణంలో ఈనెల చివరి నాటికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫాక్టరీని ప్రైవేట్‌పరం చేయొద్దంటూ లక్ష్యంగా ఈ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో అటు కేంద్రం వైఖరిని ఎండగట్టడంతో పాటు ఏపీ ప్రజల అభిమానాన్ని పొందేందుకు ఈ బహిరంగ సభ ఉపయోగ పడుతుందన్న భావనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది.

Visakha Steel Plant: విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి.. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం.. ఈ నెలాఖరులో బహిరంగ సభ!

Telangana CM KCR

Visakha Steel Plant: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని విశాఖ ఉక్కు కర్మాగారం‌ (Visakha Steel Plant) పై తెలంగాణ సర్కార్ (Telangana Government) ఆసక్తి చూపుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేయనుంది. ఈవోఐ (EOI) లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్ పాల్గొనాలని, ఇందులో భాగంగా విశాఖ ఉక్కు బిడ్డింగ్‌పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జయేష్ రంజన్ బృందం రేపు విశాఖ పట్టణం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న బీజేపీ సర్కారు‌కు బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా చూడాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు.

Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి అవంతి

విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం, ముడిసరకుల కోసం నిధులు ఇచ్చి నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ ( ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ – ఈవోఐ) ప్రతిపాదనల బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గోనుంది. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్న ఆరోపణలున్నాయి. ఈనెల 15వ తేదీ సాయంత్రం 3గంటల వరకు ఈవోఐలో పాల్గొనాలని కోరింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

KTR Open Letter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచనను సీఎం కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక, ఏపీలోని పలు పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంకు ప్రైవేట్, ఇతర స్టీల్ అనుబంధ రంగాల కంపెనీలు, సంస్థలు నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇది బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెబుతూ అంతిమంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ప్రక్రియలో తొలి అడుగు అని, ఈవోఐ రూపంలో ప్రైవేట్ కంపెనీలను చొప్పించే కుట్రకు తెరలేపిదంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

CM KCR: స్టీల్ ప్లాంట్‌‌ సభ పేరుతో ఏపీలో విస్తరణే లక్ష్యమా?

ఈ నెలాఖరున విశాఖలో బహిరంగ సభ..

విశాఖ పట్టణంలో ఈ నెల చివరిలో బహిరంగ సభనుసైతం ఏర్పాటు చేయాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఇదే అనువైనమార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఎజెండాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా విశాఖ పట్టణం కేంద్రంగా ఈ నెలాఖరున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభ వేదిక ద్వారా విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడం ద్వారా ఏపీ ప్రజల మనన్నలు పొందేలా బీఆర్ఎస్ అధినేత పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.