Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి అవంతి

రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు

Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి అవంతి

Avanthi

Visakha Steel Plant: విశాఖ స్టీల్ప్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికసంఘాలు సోమవారం విశాఖ బంద్ కి పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అడ్డుకుంటామని..ప్లాంట్ జోలికొస్తే ఊరుకునేది లేదని కార్మికసంఘాలు హెచ్చరించాయి. ప్లాంట్ ఏర్పాటుకు భూములిచ్చిన నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు కూడా రాలేదని..అయినా ఎన్నడూ ప్రభుత్వ విధానాలు తప్పుబట్టని తమకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల దీక్షా శిభిరాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈసందర్భంగా కార్మికులకు సంఘీభావం తెలిపిన మంత్రి.. స్టీల్ ప్లాంట్ జేఏసీ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

Also Read:Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్

రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అంశాలును బీజేపీ ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోకపోతే బీజేపీకు ఇక్కడ భవిష్యత్ ఉండదని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం వెనక్కు తగ్గాలన్న మంత్రి..స్టీల్ ప్లాంట్ పై ఇలాంటి వైఖరి తీసుకుంటే బీజేపీ రాష్ట్రంలో భలపడుతుందని సూచించారు. ఇక్కడ జరుగుతున్న ఉద్యమంపై ప్రధాని మోదీకి చేరవేయడంలో సమాచార లోపం ఉందని.. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని మంత్రి అన్నారు. ఆంధ్రుల మంచితన్నాన్ని అసమర్ధతగా తీసుకోవద్దన్న మంత్రి అవంతి శ్రీనివాస్..ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 110 మంది ఎంపీలతో సంతకాల సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also read:Petrol-Diesel Price : దేశంలో తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏడు రోజుల్లో ఆరోసారి పెంపు..!