Minister Ambati Rambabu
Minister Ambati Rambabu : టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకి ముమ్మాటికి చంద్రబాబే కారణం అని అన్నారు. చంద్రబాబు కన్నా కోడెల శివప్రసాద్ సీనియర్ అని.. ఆయన మరణానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. కోడెల శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అయితే, ఆయనపై కేసులు పెడితే చంద్రబాబు ఆదరించలేదన్నారు.
కోడెల శివప్రసాద్ పై అభిమానం ఉంటే చంద్రబాబు తన చుట్టూ ఐదుగురు కృష్ణులను ఎలా తిప్పుకుంటున్నాడని నిలదీశారు. సత్తెనపల్లి సీటు విషయంలో చంద్రబాబు త్వరలో తీసుకునే నిర్ణయం కోడెల శివప్రసాద్ వర్గానికి అనుకూలంగా ఉంటుందో లేదో చూడాలన్నారు. కోడెల శివప్రసాద్ విగ్రహాల ప్రారంభానికి వెళ్ళొద్దని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. స్వర్గస్తులైనవారిపై నిందలు వేయలేనని చెప్పారు.
Ambati Rambabu: చంద్రబాబుకి దరిద్రం పట్టుకుంది.. వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా?: అంబటి
బుధవారం జరిగిన చంద్రబాబు ప్రొగ్రాం అట్టర్ ప్లాప్ షో అని ఎద్దేవా చేశారు. ఐదుగురు కృష్ణులు కలిసి జనాలని పోగేశారని తెలిపారు. గ్రౌండ్ మొత్తం ఐదువేల మందికి సరిపోతుందని పేర్కొన్నారు. 2వేల మందిని తరలించారని.. మిగిలిన గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉందని ఇది చంద్రబాబు కర్మ అని విమర్శించారు. చంద్రబాబు జగన్ ని దూషించడం తప్ప ఒక్క నిజమైనా చెప్పాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందని వైఎస్సార్ గతంలో చెప్పాడని గుర్తు చేశారు.
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ముసలోడు కాదా? తాను ముసలోడినేనని చెప్పారు. ముసలోడు అంటే ఎందుకు కోపం వస్తుందని అని అడిగారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం చంద్రబాబు ఇంటర్య్యూలో మోదీ కాళ్ళు పట్టుకుంటానంటున్నాడు అని పేర్కొన్నారు. అధికారం లేకపోతే చంద్రబాబు బతకలేడన్నారు. పేదవాడిని దనవంతున్ని చేయడానికి మంత్రం ఉందని చంద్రబాబు అన్నాడని.. కానీ వాళ్లు ధనవంతులవుతారు తప్ప పేదవాళ్ళు కాదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Minister Ambati Rambabu : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
తనను ఆంబోతు అని అనొచ్చా? తనపై చాలా ఆరోపణలు చేశాడని వాపోయారు. తన గుండెమీద చేయి వేసుకొని చెబుతున్నా.. తాను ఎవ్వరికి అన్యాయం చేయలేదన్నారు. పోలవరం కుంటుపడిందన్నారు. చంద్రబాబు వల్లనే కాపర్ డ్యాం కొట్టుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకి దెయ్యం పట్టిందన్నారు. చంద్రబాబుతో పవన్ కు ఏం సంబంధమని నిలదీశారు. చంద్రబాబును విమర్శిస్తే ఎందుకు పవన్ ఉలిక్కిపడుతున్నాడని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీరావు, నాయుడు, రాధాకృష్ణ కలిసి జగన్ పై దాడి చేస్తున్నారని విమర్శించారు.