Ambati Rambabu: చంద్రబాబుకి దరిద్రం పట్టుకుంది.. వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా?: అంబటి

బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్ ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Ambati Rambabu: చంద్రబాబుకి దరిద్రం పట్టుకుంది.. వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా?: అంబటి

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి దరిద్రం పట్టుకుందని.. ఆరిపోయే దీపంలా చంద్రబాబు రంకెలు వేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ఎమ్మెల్సీ సీట్లు గెలవగానే చంద్రబాబు (chandrababu) ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని.. సింగిల్ గా ఎదుర్కోలేక పొత్తులు- ఎత్తులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ కు వణుకు పుట్టించే దమ్ము దైర్యం ఎవరికీ లేదన్నారు.

పవన్ ను చంద్రబాబే ఢిల్లీ పంపారు
చంద్రబాబు వెళ్ళమంటేనే పవన్ కల్యాణ్(pawan kalyan) ఢిల్లీ వెళ్లారని, బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్ ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చెయ్యడానికి నాదెండ్ల మనోహర్(nadendla manohar) నాయకత్వంలో పవన్ నడుస్తున్నారని అన్నారు. పవన్ కి కావాల్సింది ప్యాకేజ్.. చంద్రబాబుకి కావాల్సింది కాపు ఓట్లు అని పేర్కొన్నారు.

టీడీపీతో మళ్లీ పెళ్లి
పోలవరం ప్రాజెక్టు(polavaram project)పై నాదెండ్ల మనోహర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ‘నాదెండ్ల మనోహర్ అజ్ఞానంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి పవన్ కి మధ్య ప్యాకేజీ బ్రోకరేజ్ చెయ్యడం తప్ప ఏమీ తెలీదు. తొందరలోనే పవన్ బీజేపీతో విడాకులు తీసుకుంటారు. టీడీపీని మళ్లీ పెళ్లి చేసుకుంటారు. పవన్ పోలవరం వెళ్తే వెళ్ళమనండి.. గొడవ చెయ్యడానికి వెళ్తే ఎలా అనుమతి ఇస్తారు? అక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఉన్నా బురద జల్లడానికే కదా.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు మేము అంగీకరించాం అని రుజువు చేస్తే పవన్, మనోహర్ ఇద్దరినీ నేనే తీసుకుని వెళ్తా. దేవినేని ఉమా పెద్ద సివిల్ ఇంజినీర్ అన్ని ఆయనకే తెలుసు.. పుట్టుకతోనే పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసు.. అందుకే ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. డయా ఫ్రమ్ వాల్ తప్పుగా కట్టి వేల కోట్లు గోదాట్లో పోశార’ని అంబటి రాంబాబు (ambati rambabu) ధ్వజమెత్తారు.

Also Read: జనసేన, బీజేపీ బంధంపై నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్