Nadendla Manohar : జనసేన, బీజేపీ బంధంపై నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్

పొత్తుల అంశంలో జనసేన వైఖరి ఏంటి? బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా? ఉండదా? దీనిపై పవన్ కల్యాణ్ వైఖరి ఏంటి? బీజేపీ అగ్రనేతల మనసులో ఏముంది?

Nadendla Manohar : జనసేన, బీజేపీ బంధంపై నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్

Nadendla Manohar (Photo : Google)

Nadendla Manohar : ఏపీలో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక పొత్తుల అంశంలో జనసేన వైఖరి ఏంటి? బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా? ఉండదా? దీనిపై పవన్ కల్యాణ్ వైఖరి ఏంటి? బీజేపీ అగ్రనేతల మనసులో ఏముంది? టీడీపీని కలుపుకుని వెళతారా? ఇప్పుడీ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ-జనసేన బంధంపై జనసేన నేత నాదెండ్ల మనోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం బీజేపీ కూడా జనసేనతో కలిసి నడుస్తుందనే నమ్మకం ఉందన్నారు నాదెండ్ల మనోహర్.

Pawan-Kalyan-JP-Nadda

Pawan Kalyan, JP-Nadda (Pic: @JanaSenaParty)

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం అన్నారు నాదెండ్ల మనోహర్. ఆయన ఎంతో లోతుగా ఆలోచన చేసి ఈ నినాదం ఇచ్చారని చెప్పారు. బీజేపీ పెద్దలకు అన్నీ వివరించాక వాళ్లు కూడా సానుకూలంగా స్పందించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో అనేక అంశాలను వారికి వివరించాము అన్నారు. భవిష్యత్తు తరాల‌ మేలు కోసం మంచి నిర్ణయంతో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర పెద్దల సహకారం అవసరం అన్నారు. మాకు కూడా ఒక నమ్మకం కలిగిందన్నారు. (Nadendla Manohar)

Also Read..Pawan Kalyan : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన లక్ష్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం-పవన్ కల్యాణ్

Pawan Kalyan, JP Nadda


Pawan Kalyan, JPNadda (Pic: @JanaSenaParty)

”త్వరలోనే జిల్లాల వారీగా జనసేన కార్యాచరణ చేపడుతుంది. ఈ‌ ప్రభుత్వంలో మార్పు తెస్తాం. రాష్ట్రానికి మేలు చేయడమే మా ఉద్దేశం. పోలవరం ఎత్తు 41.15 మీటర్లు తగ్గించడానికి అనుకూలంగా జగన్ లేఖ ఇచ్చారా లేదా అనేది సమాధానం చెప్పాలి. ఇప్పటికీ రాష్ట్రం కోసం‌ వెళుతున్నట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకటే మెమోరాండం. పైన తేదీ మార్చి ఇస్తున్నారు.

పోలవరం ‌విషయంలో రాజకీయం‌ చేయాలని మేము అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం పోలవరం పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇదే అంశాన్ని కేంద్ర పెద్దలకు మా అధినేత ‌వివరించారు. మేము చెప్పిన అంశాలు‌ విని‌ జగన్ ఇంత మోసం చేస్తున్నారా అని కేంద్ర మంత్రి ఆశ్చర్యపోయారు. మా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితిని వివరించాం. వైసీపీ విముక్త ఏపీ కోసం కలిసే పని చేద్దాం అన్నారు.

Also Read..Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?

రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నాయకులతో కొంత గ్యాప్ ఉంది. కేంద్ర నాయకత్వాన్ని నమ్మాం. కాబట్టే కలిసి నడుస్తున్నాం. జనసేన ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అయినా వైసీపీకి ఓటు‌ వేయొవద్దని మేము పిలుపునిచ్చాం. బీజేపీ రాష్ట్ర నేతలు అవగాహన లోపంతో మాట్లాడారు. జగనన్న మోసం అనే పథకాన్ని పెట్టాలి. స్టిక్కర్ల స్థానంలో పచ్చ బొట్లు వేసుకోవాలి.

పరిపాలన చేత కాక ప్రకటనలకే జగన్ పరిమితం అయ్యారు. ఇప్పటివరకు మోసాలతో, మాయలతో జగన్ పాలన చేశారు. పొత్తుల విషయంలో మా అధినేత పవన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. టీడీపీతో కలుపుకోవాలనే అంశంపైనా చర్చ అయితే జరిగింది. రాజకీయ అంశాలుంటే అన్నీ చర్చకు రావడం సహజం” అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.