Minister Ambati Rambabu : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను దేవుడే రక్షించాలని చెప్పారు.

Ambati Rambabu (1)
Minister Ambati Rambabu : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని విమర్శించారు. గురువారం మార్చి30న కడపలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడం.. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్లేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నింటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలన్నారు. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలు వచ్చాయని తెలిపారు.
Minister Ambati Rambabu : పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు : మంత్రి అంబటి రాంబాబు
డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం పెరిగిందన్నారు. 2017-18 నాటి అంచనాలే 50 వేలకు దాటాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా అంబటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పుట్టాడు, ఆయన కోసమే పని చేస్తున్నాడని.. భవిష్యత్ లో పని చేస్తాడని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ను దేవుడే రక్షించాలని చెప్పారు. ఓటు చీలకుండా చేస్తామని పవన్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో నోటుకి ఓటు లాంటిది జరిగిందన్నారు. నిరూపించ లేక పోవచ్చు కానీ, టీడీపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు.