10th Exams results : నేడే పదో తరగతి పరీక్ష ఫలితాలు

ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.

10th Exams results : ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు పది పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేయనున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే అధికారులు, మంత్రి, సి‌ఎం‌వోల సమన్వయ లోపంతో ఒకసారి వాయిదా పడ్డాయి.

నిజానికి శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో అధికారులు ప్రకటించారు. శనివారం చివరి క్షణంలో ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

Civils-2021 Results : సివిల్స్-2021 ఫలితాలు విడుదల..టాప్ మూడు ర్యాంకులు అమ్మాయిలకే

ఫలితాల విడుదలపై రోజుకో మాట చెప్పడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3 వేల 776 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.results.bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఎగ్జామ్స్‌ సమయంలో పేపర్‌ లీక్ కలకలం రేపింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశామన్నారు.

ట్రెండింగ్ వార్తలు