Civils-2021 Results : సివిల్స్-2021 ఫలితాలు విడుదల..టాప్ మూడు ర్యాంకులు అమ్మాయిలకే

సివిల్ సర్వీసెస్ కు 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ లో శ్రుతిశర్మ మొదటి ర్యాంక్, అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

Civils-2021 Results : సివిల్స్-2021 ఫలితాలు విడుదల..టాప్ మూడు ర్యాంకులు అమ్మాయిలకే

Civils 2021

Updated On : May 30, 2022 / 3:20 PM IST

Civils-2021 results : సివిల్స్-2021 పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. టాప్ మూడు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకున్నారు. ఇవాళ సివిల్స్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్ సర్వీసెస్ కు 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఐఏఎస్ సర్వీసులకు 180, ఐపీఎస్ కు 200, ఐఎఫ్ ఎస్ కు 37 మందిని ఎంపిక చేసింది. జనరల్ కేటగిరిలో సివిల్స్ కు 244 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఈడబ్ల్యూఎస్ కింద 73 మంది, ఓబీసీల నుంచి 203 మంది ఎంపిక అయ్యారు.

సివిల్స్ లో శ్రుతిశర్మ మొదటి ర్యాంక్, అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మీ 25వ ర్యాంక్, రవికుమార్ 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంక్ సాధించారు.

Civils Rank : సివిల్స్ లో మెరిసిన గోల్డ్ మెడలిస్ట్… చిన్నవయస్సులోనే నెరవేరిన లక్ష్యం

ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి.చైతన్య రెడ్డి 161, ఎస్ కమలేశ్వర్ రావు 297, విద్యామరి శ్రీధర్ 336, దిబ్బడ అశోక్ 350, గూగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పులూరి చైతన్య 470, మన్యాల అనిరుధ్ 563, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్సన్ 602, బాణావాత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్ రాజ్ 676వ ర్యాంక్ సాధించారు.