Mekapati
AP Minister Goutham Reddy Died : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుకు గురై 49 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. ఉదయం చెస్ట్ పెయిన్ రావడంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఆస్పత్రికి తరలించేలోగానే మేకపాటి మృతి చెందారు. డాక్టర్లు పరీక్షించే సరికి పల్స్ దొరకలేదు. మేకపాటి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడెన్‌గా మృతి చెందడంతో అందరూ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
Mekapati Goutham
Read More : ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు తీసుకుంటాం: మంత్రి మేకపాటి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇటీవలే ఆయన దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్‌ను ప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. 1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు.
Mekapati Goutham Reddy
Read More : Mekapati Goutham Reddy : ఏపీలో రూ.18వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. వైసీపీ ఆరంభం నుంచే మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ తోనే ఉంది. ఇటీవలే ఆయనకు రెండుసార్లు కరోనా సోకింది. అనంతరం ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూర నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. రెండుసార్లు ఈయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Mekapati Goutham Reddy Abu Dhabi